ప్రియురాలు పిలిస్తే ఇంటికెళ్లిన యువకుడు.. ఊహించని షాక్, దెబ్బకు డయల్‌ 100కు ఫోన్‌

byసూర్య | Sat, May 25, 2024, 09:31 PM

ప్రియురాలి పిలిచిందంటూ ఆమె ఇంటికెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ ఎదురైంది. దొంగ అనుకొని బాలిక తండ్రి అతడిపై దాడి చేశాడు. గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో బయపడిపోయిన యువకుడు రక్షించాలని డయల్ 100కి కాల్ చేశాడు. ఘటన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.


 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ గౌస్‌నగర్‌లో నివసించే అబ్దుల్‌ సొహెల్‌ (25) గ్లాస్‌ ఫిట్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గతేడాది పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో గ్లాస్‌ ఫిట్టింగ్‌ పనిచేశాడు. ఆ సమయంలో ఇంటి యజమాని కూతురు(17)ను ప్రేమించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో బండ్లగూడ పోలీసులు అబ్దుల్‌ సొహెల్‌ను అరెస్టు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు.


జైలుకెళ్లి 45 రోజుల తరువాత ఇటీవల సొహెల్ బయటికొచ్చాడు. శుక్రవారం (మే 24) తెల్లవారుజామున 4 గంటలకు బాలిక పిలిస్తే ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఉదయం నమాజు కోసం లేచిన బాలిక తండ్రి.. యువకుడిని దొంగ అనుకుని కొట్టాడు. ఆ తర్వాత అతడు సొహెల్‌గా గుర్తించి గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టాడు. దీంతో బయపడిపోయిన సొహెల్ డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. సొహెల్‌ కుటుంబ సభ్యులు, బండ్లగూడ పోలీసులు వెళ్లి సొహెల్‌ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.



Latest News
 

నారాయణపేటలో భూ భారతి దరఖాస్తుల వేగవంత పరిష్కారం Wed, Jun 18, 2025, 01:08 PM
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ Wed, Jun 18, 2025, 01:04 PM
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. గడ్డం వివేక్‌తో సహా కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ Wed, Jun 18, 2025, 01:03 PM
పచ్చదనం కోసం పిలుపు.. మునుగోడులో మొక్కల పండుగ Wed, Jun 18, 2025, 12:58 PM
స్థానిక ఎన్నికల గెలుపుకు కాంగ్రెస్ సర్వశక్తులు.. భారీ సభలతో రైతు భరోసా బూస్ట్ Wed, Jun 18, 2025, 12:54 PM