మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్రెస్టింగ్ ట్వీట్

byసూర్య | Sat, May 25, 2024, 09:26 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జూన్ 2, 2024 వరకే హైదరాబాద్ నగరం.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ విషయంపై ఆసక్తికర ఆరోపణలు చేసింది. దీంతో.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంపై అధికార ప్రతిపక్షాలు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కాగా.. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు.


హైదరాబాద్‌ను మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని తన అభిప్రాయాన్ని లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్లకు మించకుండా హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి రాజధాని లేకపోవటంతో.. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ మరో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.


ఏపీ విభజన చట్టం ప్రకారం జూన్ 2వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండనుంది. 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగుస్తున్న వేళ.. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏపీకి మార్చబడుతున్నాయి. 2016లో 90 శాతం కార్యాలయాలు తెలంగాణ నుంచి ఏపీకి మారగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలుకు మార్చారు.


Latest News
 

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM