తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Wed, May 22, 2024, 02:31 PM

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.సీఎం హోదాలో శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం మార్గం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన మనవడి పుట్టెంట్రుకలను స్వామి వారికీ సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం తిరుపతి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లారు. రాత్రికి రచనా అతిథిగృహంలో బస చేశారు.ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


Latest News
 

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా Fri, Feb 14, 2025, 10:10 PM
సహకార సంఘాల కాలపరిమితిని పెంచిన ప్రభుత్వం Fri, Feb 14, 2025, 10:09 PM
దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ Fri, Feb 14, 2025, 10:07 PM
బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు : నీలం మధు ముదిరాజ్.. Fri, Feb 14, 2025, 09:31 PM
సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకున్నాం: జగ్గారెడ్డి Fri, Feb 14, 2025, 09:28 PM