byసూర్య | Wed, May 22, 2024, 01:44 PM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆక్సిడెంట్‌కుగురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో హాస్పిటల్‌కు తరలించారు.వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి వెంటనే కారు దిగారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించారు. సకాలంలో స్పందించి బాధితుడికి అండగా నిలిచిన కేటీఆర్‌ను పలువురు ప్రశంసించారు.