byసూర్య | Wed, May 22, 2024, 11:08 AM
పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు సైకో శివ.కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ. మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ చల్లపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు శివ. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్చల్ చేశాడు సైకో శివ. ఇక ఈ తరుణంలోనే.. శివను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.