byసూర్య | Tue, May 21, 2024, 08:54 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కేశవ నగర్ వీధిలో వెలసిన కర్రెమ్మ, కేంచమ్మ దేవాలయాలలో మంగళవారం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు పాల్గొన్నారు.