![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 08:28 PM
ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సరదాగా చేసుకున్న మందు పార్టీ ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. స్నేహితుల చేతిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో స్నేహితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన కొంత మంది స్నేహితులు సోమవారం సాయంత్రంగా సరదాగా మందు పార్టీ చేసుకున్నారు.
ఫుటుగా తాగిన తర్వాత ఏదో విషయమై స్నేహితుల మధ్య గొడవ ప్రారంభమైంది. మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తాగిన మైకంలో స్నేహితుల్లో ఒకరైన గుర్లె సుగుణ- రాములు కుమారుడు చంద్రశేఖర్ (28)పై దాడి చేశారు. బండరాళ్లతో మోది తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు చంద్రశేఖర్‌ను కరీంనగర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే కన్నుమూశాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.