byసూర్య | Tue, May 21, 2024, 04:09 PM
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన 7వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్ మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి నాలుగు నెలలుగా జీతాలు మాత్రం చెల్లించడం లేదన్నారు. ఎల్బీస్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప. వారి జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు.