byసూర్య | Tue, May 21, 2024, 02:01 PM
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి టెన్త్ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాసులుకు 2 సంవత్సరాల కిందట పెరాలసిస్ రావడంతో డ్యూటీ చేయలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న 1995 పోలీస్ బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి రూ. 1, 20, 000 పోగు చేశారు. సోమవారం మహబూబ్ నగర్ లో జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ చేతుల మీదుగా అందజేశారు. తోటి బ్యాచ్ మేట్ ను ఆదుకున్న వారిని డీఐజీ అభినందించారు.