కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు వదిలిపెట్టారు : కేటీఆర్

byసూర్య | Tue, May 21, 2024, 01:59 PM

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసమని కేటీఆర్ దుయ్యబట్టారు.అధికారంలోకి రాకముందు ప్రతి గింజకు బోనస్ అని ఊదరగొట్టి ప్రభుత్వం రాగానే చేతులేత్తేస్తారా అని నిలదీశారు.కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదన్న కేటీఆర్ రైతు వ్యతిరేక పాలన అంటూ విమర్శించారు. ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట చెప్పడంతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. తమ గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు వదిలిపెట్టరని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ షురూ అయిందని తెలిపారు.


 


 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM