byసూర్య | Tue, May 21, 2024, 12:44 PM
దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మంగళవారం మాజీ ప్రధాని కీర్తి శేషులు రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య తదితర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫరూక్ నగర్ రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.