byసూర్య | Tue, May 21, 2024, 11:24 AM
చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఏటా దీన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.