byసూర్య | Tue, May 21, 2024, 10:48 AM
ఇవాళ తిరుమలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు.ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు జరుగనుంది. ఇక అనంతరం ఏపీకి వెళతారు సీఎం రేవంత్.ఇవాళ రాత్రి లేదా సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ ఉంది. అయితే.. తిరుమలకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ వెళతారా ? లేదా ? సీఎం హోదాలో వెళ్లి….తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారా ? అనేది తెలియాల్సి ఉంది. ఇవాళ్టి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.