byసూర్య | Mon, May 20, 2024, 04:52 PM
రెండురోజుల క్రితం అర్ధరాత్రి వాహనంలో ఆవులను అక్రమంగా తరలిస్తుండగా వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేసిన కొంతమంది వసూల్ రాజాలను కొండమల్లేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం తెలిసింది. వాహన డ్రైవర్ ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు, ఈ వసూల్ దందాలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.