![]() |
![]() |
byసూర్య | Mon, May 20, 2024, 04:51 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలనికోరుతూ సోమవారం హుజురాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు హుజురాబాద్ లో వడ్ల కల్లాల సందర్శనకు వెళ్లారు. ఆయన మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశామని, వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటంతో అన్నదాతలు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారన్నారు.