బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్.. కానీ ఓ కండీషన్.. ప్రతిరోజూ

byసూర్య | Fri, May 10, 2024, 07:26 PM

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత వ్యవహారంలో ఫేక్ ప్రకటనను వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్ ఖైదీగా చంచల్ గూడా జైల్లో పెట్టగా.. శుక్రవారం రోజు నాంపల్లి కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 25 వేల పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. ప్రతిరోజూ పోలీసుల ముందు హాజరుకావాలని క్రిశాంక్‌ను నాంపల్లి కోర్టు ఆదేశించింది.


ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్, నీటి కొరత కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారంటూ ఓ ఫేక్ సర్కులర్‌ను క్రిశాంక్ వైరల్ చేశారంటూ.. ఓయూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేయగా... కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఓయూ ప్రతిష్ఠకు భంగం కలిగేలా క్రిశాంక్ దుష్ప్రచారం చేశారంటూ ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఎట్టకేలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.



Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM