రైతు బంధు పంపిణీ నిలిపివేత.. బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు

byసూర్య | Tue, May 07, 2024, 08:24 PM

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని.. అప్పటివరకు రైతు భరోసాను ఆపేయాలని రేవంత్ రెడ్డి సర్కారును ఆదేశించింది. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఎన్‌ వేణుకుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. గత గణాంకాల ప్రకారం రబీ నిధులు జనవరి నాటికే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉందని ఈసీ అభిప్రాయపడింది.


మరోవైపు.. ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ కూడా చేపట్టింది. ఇందుకోసం.. 2 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించి.. విడుదల చేసినట్టు పేర్కొంది. అంతేకాదు.. ఈ ప్రక్రియ 3 రోజుల్లోనే పూర్తవుతుందని కూడా అధికారులు భావించారు. కాగా.. ప్రస్తుతం ఈసీ ఇచ్చిన ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.


అయితే.. రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా నిధువు విడుదల చేస్తామంటూ పలు ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటాన్ని కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ.. కీలక ఆదేశాలు జారీ చేసింది.


Latest News
 

హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్ Sun, May 19, 2024, 07:34 PM