ప్రజ్వల్‌ రేవణ్ణను దేశం దాటించి.. నన్ను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం: కల్వకుంట్ల కవిత

byసూర్య | Tue, May 07, 2024, 08:19 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా అరెస్టయి.. తీహార్ జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను.. మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే.. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి.. తన లాంటి వారిని అరెస్ట్ చేయటం చాలా అన్యామన్నారు కవిత. ఈ విషయాన్ని అందరూ గమనించాలంటూ ప్రజలకు సూచించారు.


అయితే.. ఇప్పటికే జ్యుడీషయల్ కస్టడీని పలుమార్లు పొడిగించిన న్యాయస్థానం.. ఈరోజు కూడా మళ్లీ మరో వారం పాటు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో.. ఈనెల 14వ తేదీ వరకు కస్టడీ కొనసాగనుంది. ఇదిలా ఉంటే.. సీబీఐ, ఈడీ అరెస్టు అనంతరం ఆమెకు స్పెషల్ కోర్టు బెయిల్ కూడా నిరాకరించడంతో జ్యుడిషియల్ రిమాండ్ అనివార్యమైంది.


ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కవిత రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ తరఫు న్యాయవాది.. స్పెషల్ జడ్జి కావేరి బవేజాను రిక్వెస్టు చేశారు. వారం రోజుల్లో ఆమెపై చార్జ్ షీట్‌‌ను దాఖలు చేయనున్నట్లు ధర్మాసనానికి వివరించారు. హైదరాబాద్‌లో మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో చార్జిషీట్‌ను దాఖలు చేయాల్సి ఉండగా.. ఈ నెల 15 లోగా చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. దీంతో.. కవిత రిమాండ్‌ను మే 14 వరకు ధర్మాసనం పొడిగించింది.


ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానం ఎదుటు హాజరుపరిచే సమయంలో కవిత.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీడియాతో కవిత మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేయటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా.. మీడియాతో మాట్లాడటం సరికాదని మందలించింది. కాగా.. అప్పటి నుంచి కవితను వర్చువల్‌గానే కోర్టు ఎదుట హాజరుపరుస్తుండగా.. ఇటీవల తనను నేరుగా ధర్మాసనం ముందు హాజరుపర్చాలని కవిత విజ్ఞప్తి చేసింది. దీంతో.. ఈరోజు నేరుగా హాజరుపర్చగా.. ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.


Latest News
 

తీన్మార్ మల్లన్నకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి: అశోక్ Sun, May 19, 2024, 07:06 PM
కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి Sun, May 19, 2024, 07:04 PM
మున్సిపల్ కార్మికురాలికి బీజేపీ నేత సంజయ్ దాస్ ఆర్థిక సాయం Sun, May 19, 2024, 07:02 PM
సాగర్ ప్రాజెక్టు సమాచారం Sun, May 19, 2024, 06:59 PM
అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM