హైదరాబాద్‌‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్

byసూర్య | Tue, May 07, 2024, 08:16 PM

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు మాడు పగిలేలా ఎండ దంచికొట్టగా.. నిప్పులు కురిపిస్తున్న సూర్యున్ని కారు మేఘాలు కమ్మేశాయి. ఎంతలా అంటే.. ఐదున్నర సమయంలోనే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి కారు మబ్బులు కమ్ముకోగా.. ఏమవుతుందా అని జనాలు చూసేలోపే.. రాకాసి గాలులను తలపించే ఈదులు గాలులు వీస్తూ.. భయపెట్టేలా ఉరుములు, మెరుపులతో.. కుండపోతగా వర్షం కురిసింది. అది కూడా నిండు వర్షాకాలంలో కురిసినట్టుగా మేఘం విరిగిపడిందా అన్నట్టు వర్షం కురిసింది. దీంతో.. హైదరాబాద్ నగరంలోవాతావరణం పూర్తిగా తారుమారైంది. సుమారు 40 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయి.. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో.. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం నెలకొంది.


ఇదిలా ఉంటే.. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో రోడ్ల మీద మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. సరిగ్గా ఆఫీసులు వదిలే సమయంలోనే వరుణుడు విజృంభించటంతో.. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులంతా వర్షంలో తడిసి ముద్దయిపోయారు. దీంతో.. రోడ్లన్ని ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ముందుకు కదలలేక.. వర్షంలో తడుస్తూ ఉండలేక.. వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా.. నగరవాసులకు ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం దొరకనుంది. ఇదిలా ఉంటే... ఈ ఈదురుగాలులతో కూడా భారీ వర్షం వల్ల విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.


అయితే.. వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్టుగానే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీ వర్షాలు కురిశాయి. కొంపల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్‌తో పాటు మియాపూర్, కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ట్రాఫిక్ ఏరియాల్లో కూడా భారీ వర్షం కురిసింది. మరోవైపు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM