ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ రోడ్ షో.. వియ్యంకుడి తరపున ప్రచారం.. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

byసూర్య | Tue, May 07, 2024, 08:13 PM

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో ప్రచారం జోరందుకుంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. ఆయా అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు కూడా ప్రచారం చేస్తుండగా.. కొన్ని స్థానాల్లో సినీ తారలు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏపీలో జనసేన తరపున సినీ తారలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరో కాదు.. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అందరు హీరోలా కామన్ అభిమాన నటుడు విక్టరీ వెంకటేష్.


ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న తన వియ్యంకుడు రామసహయం రాఘురామ రెడ్డి తరపున వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రఘురామ రెడ్డి గెలుపు కోసం ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో వెంకటేష్ పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా వెంకటేష్‌తో పాటు పాల్గొన్నారు.


రోడ్ షోలో వేసిన బల్పంబట్టి బామ్మ ఒళ్లో పాటకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హీరో విక్టరీ వెంకటేష్ స్టెప్పులేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని గెలిపించాలని వెంకటేష్ ప్రజలను కోరారు. కాగా.. వెంకీ మామను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు అభిమానులతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి.


ఇదిలా ఉంటే.. విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రితను రఘురామ్ రెడ్డి పెద్ద కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కాగా.. ఇప్పటికే తన మావయ్య కోసం ఆశ్రిత రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇప్పుడు తమ వియ్యంకుని కోసం వెంకటేష్ కూడా రోడ్ షోలో పాల్గొనటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM