అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

byసూర్య | Wed, Apr 24, 2024, 07:58 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము 12 నుంచి 14 సీట్లు గెలుస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతుండగా.. తాము 12 సీట్లు గెలువబోతున్నామంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మంగళవారం ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తమ పార్టీ 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందని చెప్పారు.


కాగా, కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్ అండ్ బీ మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఇక తమతో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కూడా కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.


బీఆర్ఎస్ నుంచే 25 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని.. వారందరి పేర్లు తాను చెబుతానని అన్నారు. మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరే 25 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పగలరా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తాము అర్భకులం కాదని.. అర్జునులమై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తోందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయన్నారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM