నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్

byసూర్య | Tue, Apr 23, 2024, 10:44 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ కావడంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి స్పందించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది బోగస్ అని.. అసలు అది స్కామే కాదని.. మోదీ చేసిన సృష్టి అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. అది ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఓ పాలసీ అని.. అన్ని రాష్ట్రాలకు ఇలాంటి పాలసీలు ఉంటాయని.. అందులో స్కాం ఏముంటుందని చెప్పుకొచ్చారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఓ పిటిషన్ వేపించి.. ఈ కేసును ఈడీ, సీబీఐకి అప్పగించిందంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇందులో ఢిల్లీ సీఎంను, డిప్యూటీ సీఎంను మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేపించిందని.. ఓ ఆడపిల్ల అని కూడా చూడకుండా నిర్దోషి అయిన కవితను అన్యాయంగా అరెస్టు చేశారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మొదట సాక్షిగా కవితను విచారించి.. ఆ తర్వాత సోదాలు చేసి అరెస్ట్ చేశారన్నారు. రెండున్నరేళ్లుగా ఈ కేసు నడుస్తోందని.. అయినా ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదని చెప్పుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఓ పార్టీ ఎమ్మెల్సీకి బెయిల్ ఇవ్వకపోవటం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. తన కూతురు కచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


అయితే.. దీనంతటికీ కారణం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగంగా బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు తామ ప్రభుత్వంలో పోలీసులను పంపించామని.. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తనపై కక్ష పెంచుకున్నారని.. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారంటూ కేసీఆర్ కీలక ఆరోపణలు చేశారు.


Latest News
 

దసరాకు క్రికెట్‌ ధమాకా Fri, Oct 11, 2024, 11:28 AM
స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత రామ‌లింగ‌రాజును ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి Fri, Oct 11, 2024, 10:47 AM
విమానంలో మహిళకు వేధింపులు.. Fri, Oct 11, 2024, 10:40 AM
వనపర్తి జిల్లాను 100% అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్ Fri, Oct 11, 2024, 10:29 AM
కల్లు తాగితే కిడ్నీలో రాళ్లకు చెక్ Fri, Oct 11, 2024, 10:20 AM