తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్

byసూర్య | Tue, Apr 23, 2024, 09:08 PM

తెలంగాణలో గతకొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంటుంది. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజల క్రితం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ వర్షం దంచికొట్టింది. అయితే వాతావరణంలో అనుహ్యంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉందని.. అలాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.


నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, రామగుండం ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయన్నారు. తెలంగాణలో పగటివేళ 36 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ వేడి ఉంటుందని చెప్పారు. దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైనే ఎండల తీవ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇక హైదరాబాద్‌లో పగటి ఉష్టోగ్రతలు విపరీతంగా పెరుగుతాయన్నారు. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM