![]() |
![]() |
byసూర్య | Sun, Apr 21, 2024, 11:47 AM
మతిస్థిమితం సరిగా లేక ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మండలంలోని నూతనకల్ లో పెద్ద చెరువు లో మస్కూరి నవీ (31) మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గమనించి మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుండి బయటికి తీశారు. నవీన్ మతిస్థిమితం సరిగ్గా లేదని స్థానికులు తెలిపారు.