చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

byసూర్య | Fri, Apr 19, 2024, 07:46 PM

వీసా దేవుడు.. కలియుగదైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాజీ ఆలయంలో ఏటా వారం పాటు జరిగే జరిగే బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేదపండితులు పుట్టమన్నుతో పూజలకు అంకుర్పారణ చేశారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. వేడుకల్లో బాలాజీ ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ సౌందరరాజన్‌, ప్రధానార్చకులు రంగరాజన్‌, ఆలయ కమిటీ సభ్యులు గోపాలకృష్ణపంతులు,స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల ఇవాళ ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహిస్తారు.


ఇవాళ గరుత్మంతుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని సంతానం కలగని మహిళలకు పంపిణీ చేస్తుండగా.. శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరగా.. కిలోమీటర్ల పొడువున ట్రాఫిక్ జామ్ అయ్యింది. భక్తులు బైక్‌లు కార్లు పార్క్ చేసి.. కిలో మీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళుతున్నారు. ఉదయం 7 నుంచి 9గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ప్రసాదం పంపిణీ చేస్తారు. మహిళలకు మాత్రమే ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.


ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ఏటా శ్రీరామనవమి తరువాత దశమి రోజు నుంచి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం (ఏప్రిల్ 18) సెల్వర్‌ కూత్తుతో అంకురార్పణ జరిగింది. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 19న ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించారు. 20వ తేదీన స్వామివారికి గోపవాహన, హనుమంత వాహన సేవలు నిర్వహిస్తారు. 21న సూర్యప్రభ వాహనం, గరుడ వాహన సేవలు అందిస్తారు.. అదే రోజు రాత్రి 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.


ఈ నెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకీ సేవ, అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి దివ్యరథోత్సవం ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, దోప్‌సేవ, పుష్పాంజలి సేవలు చేస్తారు. 25న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM