ఆ భూమి మొత్తం అటవీ శాఖదే

byసూర్య | Fri, Apr 19, 2024, 10:55 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొంపల్లి శివారులోని సర్వే నెంబర్ 171లో గల 106 ఎకరాల భూమి అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించింది.సర్వే నెంబర్ 171లో గల 106.34 ఎకరాల భూమిపై హక్కును కోరుతూ 1985లో మహ్మద్ అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తి వరంగల్ డిస్ట్రిక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసులో తీర్పు 1994లో అటవీ శాఖకు అనుకూలంగా వెలువడగా.. సదరు వ్యక్తి హైకోర్టులో అప్పిలు పిటిషన్ దాఖలు చేశాడు.. ఆ అప్పీలు పిటిషన్ పై కూడా 2018లో హైకోర్టు అటవీశాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.. ఇక, ఈ తీర్పుపై కూడా మహ్మద్ అబ్దుల్ ఖాసిం రివ్యూ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయగా.. ఆ భూమి అతనికే చెందుతుందని 2021లో రాష్ట్ర న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.కాగా, ఈ తీర్పుపై 2021లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ ఫైల్ చేసిన సుప్రీంకోర్టు.. స్పెషల్ లీవ్ పిటిషన్ పై వాదనలు విన్న ఇద్దరు జడ్జిల ధర్మాసనం అటవీశాఖకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇక, ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్ట ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించి.. తనదిగా నిరూపించుకోలేని వ్యక్తికి 106 ఎకరాల అటవీ భూమిని గిఫ్టుగా ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది.


Latest News
 

ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM
ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు Thu, May 02, 2024, 10:26 AM
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 10:23 AM
నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM