రాములోరి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటికే స్వామివారి తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి

byసూర్య | Mon, Apr 15, 2024, 08:37 PM

రాములోరి భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జ‌రిగే సీతారాముల కళ్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను ఆన్‌లైన్‌‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


టీఎస్‌ఆర్టీసీ సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్‌సైట్ http://tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కళ్యాణ తలంబ్రాలను పొందాలని సూచించారు. ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సజ్జనార్ పేర్కొన్నారు.


ఎలా బుక్ చేసుకోవాలంటే..


టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్‌లో కళ్యాణ తలంబ్రాలు అందరుబాటులోకి వచ్చాయి. వెబ్‌సైట్‌లో తలంబ్రాలు బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే అందులో అడ్రస్ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. తర్వాత తలంబ్రాల ప్యాకెట్లు ఎన్ని కావాలనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక తలంబ్రాల ప్యాకెట్ రూ. 151 ధరను టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని వివరాలు నింపిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. యూపీఐ ఐడీ ద్వారా కూడా పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ అయ్యిందనే ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ రావటంతో.. బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.


విశిష్టమైన రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది.



Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM