రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు, రేపు నిప్పుల కుంపటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

byసూర్య | Mon, Apr 15, 2024, 07:54 PM

తెలంగాణలో మెున్నటి వరకు మబ్బులు కమ్ముకున్నాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. కూల్ సమ్మర్‌ను ప్రజలు ఎంజాయ్ చేశారు. తాజాగా.. భానుడు మరోసారి భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 తర్వాత కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం ఏడు జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి. మరో రెండు జిల్లాల్లో 41.5 డిగ్రీలపైన నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి మండలం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలాల్లో 42.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 42.4 డిగ్రీలు, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో 42.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోనూ ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం మూసాపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని అంటున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని.. బయటకు వెళితే టోపీ, గొడుగు వంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బకు గురి కాకుండా చల్లని ప్రదేశాల్లో ఉండాలని అంటున్నారు.


Latest News
 

బుగ్గార మండలం గ్రామాల్లో పలువురిని పరామర్శించిన MLA విప్ Mon, Oct 21, 2024, 04:36 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. Mon, Oct 21, 2024, 04:32 PM
బుగ్గారం ఎక్స్ రోడ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన BRS నాయకులు Mon, Oct 21, 2024, 04:30 PM
పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM
ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన Mon, Oct 21, 2024, 04:22 PM