జిల్లేడు పూలు అంత ఖరీదైనవా..? కేజీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

byసూర్య | Sun, Apr 14, 2024, 09:48 PM

జిల్లేడు పూలు తెలుసు కదా..! సాధారణంగా సేద్యం చేయని పడావు పడిన భూముల్లో ఈ చెట్లు విరివిగా పెరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో చెరువు గట్లపై, ఖాళీ స్థలాల్లో ఎక్కడపడితే అక్కడ అవి ఏపుగా పెరుగుతాయి. ఈ మెుక్కలు విషపూరితమని.. వాటి నుంచి వచ్చే పాలు ప్రమాదకరమని గ్రామాల్లో పెద్దలు ఉంటూ ఉంటారు. ఇక వాటి పూలు దేనికి పనికిరావని అంటారు. కొన్ని చోట్ల ఆ పూలతో దేవుడిని పూజిస్తారు. అయితే ఆ పూలకు ఉన్న డిమాండ్.. వాటికి ఉన్న ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.


కేజీ జిల్లేడు పూలు ప్రస్తుతం రూ. 2.700 పలుకుతుందని బీజేపీ నేత, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియో పోస్టు చేశారు. సాధారంగా పర్పుల్ కలర్‌ జిల్లేడు పూలు ఉంటాయని.. అవి విషపూరితమని చెప్పారు. అవి శివుడిని పూజించడానికి ఉపయోగిస్తారు.. కానీ ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. కానీ.. తెల్ల జిల్లేడు పూలకు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రస్తుతం కేజీ తెల్ల జిల్లేడు రూ. 2,700 పలుకుతుందని చెప్పారు. ఈ పూలను డెకరేషన్ కోసం వాడతరాని అందుకే వీటికి అంత డిమాండ్ ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పూలను థాయ్‌లాండ్ నుంచి మన దగ్గరకు దిగుమతి చేసుంటున్నారని వెల్లడించారు.


తెల్ల జిల్లేడు పెరిగేందుకు చేవెళ్ల ప్రాంతం అనువైనదని విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో వర్షం తక్కువగా కురుస్తుందని.. అందుకే ఈ జిల్లేడు సాగు ఉత్తమమైనది అంటున్నారు. ఈ పంటకు ఎక్కువగా నీరు అవసరం లేదని.. అలాగే చీడ పీడలు, ఎరువులు వంటికి కూడా వేయాల్సిన పనిలేదని.. ఎలాంటి కలుపుతీత బాధలు ఉండవని చెబుతున్నారు. తాను ప్రస్తుతం ఎకరం పొలంలో ఈ పంటను సాగుచేస్తున్నానని చెప్పిన కొండా.. తాను సక్సెస్ సాధిస్తే చేవెళ్ల ప్రాంతంలోని రైతులను కూడా సాగు వైపు మళ్లిస్తానని అంటున్నారు.


Latest News
 

ఘనంగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు Fri, Oct 18, 2024, 09:50 PM
మియాపూర్‌ మెట్రో వద్ద చిరుత.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు Fri, Oct 18, 2024, 09:49 PM
ఆసుపత్రులలో అవసరమైన పరికరాల ప్రతిపాదనలు రూపొందించాలి Fri, Oct 18, 2024, 09:38 PM
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Fri, Oct 18, 2024, 09:36 PM
తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని విమర్శ Fri, Oct 18, 2024, 09:33 PM