జగనన్నా.. మీరు సేఫ్‌గా ఉన్నందుకు సంతోషం.. టేక్ కేర్: కేటీఆర్

byసూర్య | Sun, Apr 14, 2024, 09:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరగటం ఇప్పుడు రెండు రాష్ట్రాలను ఒక్కసారిగా కుదిపేసింది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా.. విజయవాడలో పర్యటిస్తున్న జగన్‌పై రాయితో దాడి చేయగా.. ఆయన ఎడమ కంటిపై తీవ్రంగా గాయమైంది. అయితే.. ఈ దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాయి దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. జగన్ సురక్షితంగా బయటపడినందుకు సంతోషమని చెప్పుకొచ్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్.


"మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్నా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాను." అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. విజయవాడ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ దగ్గర జగన్మోహన్ రెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. క్యాట్ బాల్ సాయంతో రాయి విసిరగా.. జగన్ ఎడమ కంటికి తీవ్ర గాయమైంది. ఇదే క్రమంలో జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయమైంది. రక్తస్రావం జరుగుతున్న జగన్‌ను వెంటనే బస్సులోపలికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జగన్ మళ్లీ బస్సుయాత్రను యధావిథిగా కొనసాగించారు. అయితే.. ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Latest News
 

శబరిమల వరకు మహా పాదయాత్ర Fri, Oct 18, 2024, 10:44 AM
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు Fri, Oct 18, 2024, 10:21 AM
తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM