byసూర్య | Sat, Apr 13, 2024, 03:29 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ శనివారం తెలిపిన వివరాలిలా. రాఘవపేటకు చెందిన మాదం గంగాధర్ (32) శుక్రవారం బైకుపై తన ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్య లోనే మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.