byసూర్య | Sat, Apr 13, 2024, 03:26 PM
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో శుక్రవారం సాయంత్రం జూదం ఆడుతున్న పదకొండు మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. పక్కా సమాచారం మేరకు గ్రామంలో పేకాట స్థావరంపై దాడులు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 49, 760 స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతి వివరించారు.