byసూర్య | Sat, Apr 13, 2024, 03:21 PM
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. కలిగోట్ గ్రామానికి చెందిన శేఖర్(32) నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు చేపలు పట్టేందుకు గ్రామంలోని కుమ్మరి కుంటకు వెళ్లాడు. చెరువులో ఉన్న వల తట్టుకొని మునిగిపోయాడు. నేడు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశామన్నారు.