byసూర్య | Fri, Apr 12, 2024, 05:06 PM
నారాయణపేట మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రముఖ బంగారు వ్యాపారి హరినారాయణ భట్టాడ్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ కు అందించారు. నారాయణపేట లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. నిన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజ్ రాజీనామా చేయగా నేడు వైస్ చైర్మన్ రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైంది.