తెలంగాణలో 4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లోనే, ఎల్లో అలర్ట్ జారీ

byసూర్య | Tue, Apr 09, 2024, 06:22 PM

తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కుబురు చెప్పింది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటు వడగాలులు వీస్తాయన్నారు. ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. నేడు మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఈ జిల్లాలతో పాటు కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.


తెలంగాణలో ఎండలు, వేడి గాలులు.. ప్రజలకు బిగ్ అలర్ట్


దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత రెండు వారాలుగా 44 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్‌లో సోమవారం 40 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యయాయి. సాయంత్రం చల్లని గాలులు వీయటంతో నగరవాసులు ఉపశమనం పొందారు. నేడు కూడా నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.


Latest News
 

ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM
మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM