తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరం వరికి రూ.45 వేలు, పత్తికి రూ. 46 వేలు

byసూర్య | Tue, Apr 09, 2024, 06:10 PM

తెలంగాణ రైతులకు నిజంగా ఇది గుడ్‌న్యూస్. పంట రుణాలపై ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు కీలక సిఫార్సు చేసింది. గతంలో కంటే ఎక్కువగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. వరి ఎకరానికి కనిష్ఠంగా రూ.42 వేలు, గరిష్ఠంగా రూ.45 వేల వరకు పంట రుణం ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాష్ట్రంలో వరి తర్వాత పత్తి ఎక్కువగా పండిస్తుండగా.. తెల్ల బంగారానికి రూ.44-46 వేలు, మొక్కజొన్నకు రూ.32-34 వేలు, మిర్చికి రూ.80 వేలు, పసుపు పంటకు గరిష్ఠంగా రూ.87 వేల వరకు ఇవ్వాలని నిర్దేశించింది. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు గత నెల 13న సచివాలయంలో నాబార్డు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ, రాష్ట్ర సహకార బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు.


విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, పెరిగిన రవాణా, కూలీల ఖర్చులు తదితర అంశాల ప్రాతిపదికన ఏ పంటకు ఏ మేరకు రుణాలివ్వాలనే దానిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరం రాష్ట్రంలో సాగయ్యే వివిధ పంటలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు 2024-25 రుణ పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ని ఖరారు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్‌లకు తాజా రుణ పరిమితులు అమలు చేయాలని నిర్దేశిస్తూ కమిటీ ఛైర్మన్‌ రఘునందన్‌రావు, కన్వీనర్‌ మురళీధర్‌లు తాజాగా అన్ని బ్యాంకులు, డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాలకు లెటర్లు రాశారు. ఈ మేరకు పశుసంవర్ధకం, మత్స్య శాఖలకు కూడా రుణ పరమితి పెంచారు. గతంలో ఒక యూనిట్‌ (20 మేకలు, ఒక పొట్టేలు)కు రూ.21-23 వేల రుణం ఇవ్వగా.. దానిని రూ.22-24 వేలకు పెంచారు. గొర్రెల యూనిట్‌కు రూ.24-26 వేలు, పందుల యూనిట్‌కు రూ.57-59 వేలు రుణంగా ఇవ్వాలని కమిటీ సూచించింది.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM