అంత్యోదయ అన్నయోజన రేషన్‌ కార్డు లబ్ధిదారులకు 'తీపి' కబురు

byసూర్య | Tue, Apr 09, 2024, 05:58 PM

అంత్యోదయ అన్నయోజన కింద రేషన్‌ కార్డుదారులు ఉన్నవారికి తీపి కబురు. వారికి రేషన్ బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.. ఏఏవై కార్డుదారులకు చక్కెర పంపిణీ చేసేందుకు పలువురు రేషన్‌ డీలర్లు ఆసక్తి చూపించటం లేదు. చాలామంది డీలర్లు డీడీలు కట్టట్లేదు. కట్టినవారిలో కొందరు ఇంకా చక్కెర రాలేదని సాకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలవారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని.. ఏఏవై కార్డుదారులకు పంపిణీ చేయాలని ఉత్తర్వులు వెలువరించింది.


తెలంగాణ వ్యాప్తంగా 5.99 లక్షల మంది ఏఏవై రేషన్‌కార్డుదారులు ఉన్నారు. కార్డుకు కిలో చొప్పున ప్రతి నెలా 599 టన్నుల చక్కెర అవసరం ఉంటుంది. ఈ మేరకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో చక్కెర నిల్వలు ఉండాలి. డీలర్లు డీడీలు కట్టి.. కార్డులకు కేటాయింపుల మేరకు చక్కెర తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణవ్యాప్తంగా 17,235 మంది డీలర్లు ఉండగా.. ఈ నెల 1వ తేదీ నుంచే బియ్యం సరఫరా మొదలైంది. అయినా చాలా దుకాణాల్లో చక్కెర మాత్రం పంపిణీ చేయటం లేదు. బియ్యం, గోధుమలు, చక్కెరల్లో ఏమిచ్చారు.. ఎంతిచ్చారన్నది కార్డుదారులకు డీలర్లు ప్రింట్‌ ఇవ్వాలి. చాలా రేషన్‌ దుకాణాల్లో ఈ ప్రింట్లు కూడా ఇవ్వటం లేదు. కొందరు డీలర్లు బియ్యంతో సరిపెట్టి చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో రూ.40-45 వరకు ధర ఉండగా.. అంత్యోదయ కార్డుదారులకు సబ్సిడీపై కిలో చక్కెర రూ.13.50లకే అందించాలి. డీలర్లు సక్రమంగా చక్కెర సరఫరా చేస్తే పేదలకు మేలు జరగనుంది.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM