చేదు తీపి సమ్మేళనమే జీవితం.. స్మితా సబర్వాల్ ఉగాది స్పెషల్ పోస్ట్

byసూర్య | Tue, Apr 09, 2024, 05:43 PM

తెలుగు ప్రజలంతా క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగ రోజున.. ప్రత్యేక పూజలు చేసి.. షడ్రుచుల సమ్మేళనంతో పచ్చడి చేసుకుని ఆస్వాధిస్తారు. జీవితమంటేనే కష్టసుఖాల సమ్మిళితమని గుర్తు చేస్తూ.. తెలుగు ప్రజలు ఈ పచ్చడిని చేసుకుంటారు. అయితే.. ఈ ప్రత్యేక ఉగాది పర్వదినం రోజున.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌ స్మిత సబర్వాల్.. స్పెషల్ విషెస్ చెప్పారు.


గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన స్మితా సబర్వాల్‌.. ట్విట్టర్, ఇన్‌స్టా గ్రాంలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ తన ఫాలోవర్స్‌‌కు అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు వినూత్నంగా విషెస్ తెలిపారు. "నా ప్లేట్‌లో అన్నీ దొరికాయి.. చేదు, తీపి ఇలా అన్ని రుచులతో జీవితాన్ని ఆస్వాదించాలని గుర్తు చేస్తున్నందుకు ఉగాది అంటే ఎంతో ఇష్టం. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు". అంటూ రాసుకొచ్చారు. విషెస్‌తో పాటు.. ఉగాది పచ్చడి, మామిడాకులు, పూజ ద్రవ్యాలు ఉన్న ప్లేట్‌ పట్టుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు స్మితా సబర్వాల్.


ఇలా.. ట్విట్టర్, ఇన్‌స్టా గ్రాం వేదికల్లో తన ఫొటోలు, వీడియోలు చేస్తూ.. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. దీంతో.. స్మితా సబర్వాల్‌కు సోషల్ మీడియాతో ఓ సినిమా స్టార్‌కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంటుంది. స్మితా సబర్వాల్‌కు ట్విట్టర్‌‌లో 4 లక్షల 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. సమాజంలో జరిగే అన్ని విషయాలపై స్పందిస్తూ.. తనదైన అభిప్రాయాలను షేర్ చేసుకుంటుంటారు.


Latest News
 

వ్యర్థాలను తొలగించే బాధ్యత బిల్డర్లదేనన్న హైడ్రా కమిషనర్ Sun, Oct 27, 2024, 03:35 PM
మూసీ పునరుజ్జీవ పనులను కేసీఆర్ ఎప్పుడో ప్రారంభించారన్న కేటీఆర్ Sun, Oct 27, 2024, 03:34 PM
జన్వాడ ఫామ్‌హౌస్‌పై సీఎం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్య Sun, Oct 27, 2024, 03:32 PM
బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్ పార్టీలు నిర్వహిస్తారా? అని బండి నిలదీత Sun, Oct 27, 2024, 03:30 PM
రూ.200 కోట్లతో స్కిల్ వర్సిటీ భవన నిర్మాణాలకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ Sun, Oct 27, 2024, 03:28 PM