బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్ పార్టీలు నిర్వహిస్తారా? అని బండి నిలదీత

byసూర్య | Sun, Oct 27, 2024, 03:30 PM

తన బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ దొరికిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీల నిర్వహణా? అని మండిపడ్డారు. డ్రగ్స్ తీసుకొని దొరికినా కేటీఆర్ బుకాయిస్తాడేమోనని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక్కడి సీసీ ఫుటేజీ, ఆధారాలు ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారు ఎంతటి వారైనా అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.ఈ కేసులో సుద్దపూసను కావాలనే తప్పించారనే ప్రచారం సాగుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అందరిపైనా చర్యలు తీసుకొని చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం నిరూపించాలని కోరారు. యువతను భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ విషయంలో రాజీ ధోరణి వద్దని కేంద్రమంత్రి సూచించారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM