byసూర్య | Mon, Apr 08, 2024, 03:20 PM
తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణపేట మండలం సింగారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది వేడుకలను విద్యార్థులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులంతా కలిసి ఉత్సాహంగా షడ్రుచుల పచ్చడి తయారు చేసి తోటి విద్యార్థులకు పంచారు. అంతకు ముందు పచ్చడి కుండకు పూజలు నిర్వహించినారు. సిబ్బంది పాల్గొన్నారు.