సికింద్రాబాద్‌ బరి నుంచి దానం ఔట్.. బొంతు రామ్మోహన్ ఇన్..! కారణం ఇదేనా

byసూర్య | Fri, Mar 29, 2024, 07:38 PM

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు పోటీ పడి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లు కూడా ఇస్తోంది. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా ఖరారుల చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. అయితే.. పలు కారణాలతో దానం తీరుపై అధిష్ఠానం గుర్రుగా ఉందని.. ఆయనను పోటీ నుంచి తప్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో.. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్‌‌‌కు టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది.


అయితే.. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్ ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇప్పుడు ఎందుకు మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే యోచనలో ఉందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే.. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే సమయంలోనే.. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కావాలని డిమాండ్ చేసిన దానంకు.. అధిష్ఠానం కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. ఎంపీ టికెట్‌ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ కండీషన్‌కు ఒప్పుకోవటంతోనే.. మూడో జాబితాలో దానం నాగేందర్‌ పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది.


అయితే కండువా కప్పుకునే ముందు అన్ని కండీషన్లకు ఒప్పుకున్న దానం నాగేందర్.. ఇప్పటికి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈ క్రమంలోనే.. దానం నాగేందర్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు అవుతున్నాయి. కోర్టు కూడా దానంకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ.. దానం నాగేందర్‌ను పోటీ నుంచి తప్పించి ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. హైదరాబాద్ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌‌ కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌నే ఆశించి రావటంతో.. ప్రస్తుతం ఆయన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధిష్ఠానం నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM