బీఆర్ఎస్‌ పార్టీలో చెత్తంతా పోయింది, ఇక మిగిలింది వాళ్లే.. అసెంబ్లీ మాజీ స్పీకర్

byసూర్య | Fri, Mar 29, 2024, 07:26 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలంతా కాంగ్రెస్ బాట పడుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేత అయిన కేకే, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి, సిట్టింగును కాదని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన కడియం శ్రీహరితో పాటు వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేసిన ఆయన కుమార్తె కడియం కావ్య లాంటి నేతలు.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతుండటం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. కాగా.. నేతలు పార్టీ మారుతుండటంపై అసెంబ్లీ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి చెత్త అంతా పోయిందని.. గట్టి వాళ్లే మిగిలారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు పార్టీలోనే ఉన్నారని పోచారం చెప్పుకొచ్చారు.


సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మాట్లాడిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పదవులు, అధికారం, వ్యాపారాల కోసం వచ్చిన స్వార్థపరులు, మోసకారులే పార్టీ మారుతున్నారని పోచారం మండిపడ్డారు. మోసకారుల లిస్ట్ రాస్తే మొదటి పేరు బీబీ పాటిల్‌దే ఉంటుందన్నారు పోచారం. పార్లమెంట్ ఎన్నికల తరవాత బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయని పోచారం జోస్యం చెప్పారు. ఎవరు పార్టీ వీడినా.. వచ్చే నష్టమేమీ లేదని దీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని పోచారం చెప్పుకొచ్చారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM