ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం

byసూర్య | Fri, Mar 01, 2024, 10:25 PM

 తెలంగాణలో ఇంటర్మీయట్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. ఈ పరీక్షల సందర్భంగా నిమిషం నిబంధనను తీసుకొచ్చింది ఇంటర్మీయట్ బోర్డు. ఈ రూల్ ప్రకారం.. పరీక్షా సమయం వరకు కేంద్రానికి విద్యార్థి ఒక్క నిమిషం ఆలస్యమైనా.. లోపలికి అనుమతించరు. అయితే.. ఈ రూల్‌ను అధికారులు కఠినంగా అమలు చేస్తుండటంతో.. చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యమవుతూ.. ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. కొందరు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోతుంటే.. మరికొందరు మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి వచ్చినా.. కరెక్ట్ టైంకి చేరుకుంటామో లేదా అన్న టెన్షన్‌తోనే తాము చదివిన విషయాలన్ని మర్చిపోయి ఎగ్జామ్ హాల్‌లోకి ఎంటర్ అవుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. నిమిషం నిబంధనను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


పరీక్ష మొదలయ్యే సమయం అంటే.. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో.. విద్యార్థులకు కొంత ఉపశమనం దొరకనుంది. అయితే.. గ్రేస్ పీరియడ్ ఇచ్చారు కదా మెల్లిగా వస్తే.. మళ్లీ మొదటికే మోసం వస్తుంది. గ్రేస్ పీరియడ్ కేవలం 5 నిమిషాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని విద్యార్థులు.. కొద్దిగా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని.. పీస్ ఫుల్ మైండ్‌తో ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లేలా చూసుకోండి. మరోవైపు.. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు అధికారులు రిపోర్ట్ చేశారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు తీసుకెళ్లరాదని సీఎస్ స్పష్టం చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM