తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్

byసూర్య | Fri, Mar 01, 2024, 09:21 PM

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. అన్నదాతలకు లబ్ది చేకూరేందుకు.. కేంద్ర ప్రభుత్వం పథకంలోకి తెలంగాణ ప్రభుత్వం తిరిగి చేరింది. రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు.. పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యద‌ర్శి రితేష్ చౌహాన్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా.. రైతుల‌కు ద‌న్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే కాంగ్రెస్ ప్రభుత్వ ల‌క్ష్యమ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు రంగంలోని ప్రతికూల‌త‌లు త‌ట్టుకుంటూ రైతులకు ర‌క్షణగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌నలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరుతున్నట్టు ప్రకటించారు.


పీఎంఎఫ్‌బీవైలో 2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ఉన్న విష‌యం, ఆ త‌ర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉపసంహ‌రించుకున్న తీరుపై చ‌ర్చించారు. పీఎంఎఫ్‌బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగిచేర‌టంతో వ‌చ్చే పంట కాలం నుంచి రైతులు ఈ ప‌థ‌కం నుంచి పంట‌ల బీమా పొంద‌నున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతుల‌కు ప్రయోజ‌నం క‌లుగుతుంద‌ని.. పంట‌లు న‌ష్టపోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని రితేష్ చౌహాన్ తెలియ‌జేశారు. రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్ర విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యద‌ర్శి చంద్రశేఖ‌ర్ రెడ్డి, రాష్ట్ర వ్యవ‌సాయ‌, స‌హ‌కార శాఖ కార్యద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు, వ్యవ‌సాయ శాఖ డైరెక్టర్ గోపి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా నక్క రమేష్ Sat, Jul 27, 2024, 12:23 PM
తాము మాట్లాడుతుంటే చూపించడం లేదన్న హరీశ్‌రావు Sat, Jul 27, 2024, 12:11 PM
సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు Sat, Jul 27, 2024, 11:21 AM
సైబర్ వలలో పడి 70వేలు మోసం Sat, Jul 27, 2024, 11:07 AM
జహీరాబాద్ రూరల్ సిఐగా జక్కుల హనుమంతు పదవి బాధ్యతలు Sat, Jul 27, 2024, 11:05 AM