సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

byసూర్య | Thu, Feb 29, 2024, 04:24 PM

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దామని… ఎవరెంటో తేల్చుకుందామన్నారు.పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. చేవెళ్ల సభ వేదికగా బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిసవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి మనఇద్దరం పోటీ చేద్దామని… ఎవరెంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు.“రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసి మల్కాజిగిరి కి వచ్చి పోటీ చేయి చూసుకుందాం. నేనూ పోటీ చేస్తాను. నువ్వు కొడంగల్ రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్లలో రాజీనామా చేసి వస్తాను. సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. నీ సిట్టింగ్ సిట్ లోనే తేల్చుకుందాం” అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.


Latest News
 

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Apr 12, 2024, 10:19 PM
ఏటీఎం దొంగ అరెస్ట్..! Fri, Apr 12, 2024, 07:01 PM
మరుగుదొడ్లకు హిందూ దేవతల పేర్లు Fri, Apr 12, 2024, 06:58 PM
ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Fri, Apr 12, 2024, 06:55 PM
'ఇవి చేసినప్పుడే మా గ్రామానికి రావాలి' Fri, Apr 12, 2024, 06:53 PM