![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 04:18 PM
ఖమ్మం లెనిన్ నగర్ కు చెందిన మడిపల్లి స్టాలిన్ రూ. 75 లక్షలకు గాను గురువారం కోర్టులో దివాళా పిటీషన్(ఐపీ) దాఖలు చేశాడు. ఆయన ఖమ్మంలో ఎస్ఎస్ ల్యాబ్ పేరుతో రక్త పరీక్షల కేంద్రాన్ని నిర్వహించగా,
పలువురి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చలేని పరిస్థితి ఎదురైందని పేర్కొంటూ 18మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది ద్వారా దివాళా పిటీషన్ దాఖలు చేశాడు.