గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

byసూర్య | Fri, Feb 23, 2024, 04:14 PM

మేడారం సమ్మక్క- సారలమ్మను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 27న సాయంత్రం మరో రెండు పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. మార్చి 2న 6000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.


Latest News
 

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Apr 12, 2024, 10:19 PM
ఏటీఎం దొంగ అరెస్ట్..! Fri, Apr 12, 2024, 07:01 PM
మరుగుదొడ్లకు హిందూ దేవతల పేర్లు Fri, Apr 12, 2024, 06:58 PM
ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Fri, Apr 12, 2024, 06:55 PM
'ఇవి చేసినప్పుడే మా గ్రామానికి రావాలి' Fri, Apr 12, 2024, 06:53 PM