|
|
byసూర్య | Fri, Feb 23, 2024, 04:13 PM
ఇంటర్ పరీక్షలను పకడ్బందిగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సభ్యులు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని గిరి ప్రసాద్ భవన్ లో నిర్వహించిన సంఘం సమావేశంలో మాట్లాడారు.
మాస్ కాపీయింగ్ జరగకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 28 నుండి మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.