byసూర్య | Fri, Feb 23, 2024, 03:39 PM
ముస్లింలు నిర్వహించుకొనే షబ్-ఎ-బరాత్ పండుగకు సెలవు ఇవ్వాలని అల్ ఫైజ్ సొసైటీ అధ్యక్షుడు జహంగీర్ బాబా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఈమెయిల్ ద్వారా వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉందని తెలిపారు. ఒక్క పొద్దులు వదిలే సమయానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.