byసూర్య | Fri, Feb 23, 2024, 03:33 PM
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం వెంకటాపురంలో బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మతిస్థిమితం లేని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కొల్లాపూర్ కు చెందిన సయ్యద్ మర్షిద్ ఫీర్ (73) గత కొన్ని రోజులుగా గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడని, అనారోగ్యంతో మృతి చెందినట్లు కుమారుడు సయ్యద్ వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.